Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇటీవలే పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆస్తుల విలువ కలిపితే వేల కోట్లను దాటేసింది. ఇక రామ్ చరణ్ కు సంబంధించిన నికర ఆస్తుల వాల్యూ రూ. 1300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. టాలీవుడ్ లో చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తో పాటు రామ్ చరణ్(Ram Charan) కూడా ఆస్తుల విలువ రోజు రోజుకు పెరుగుతోంది.
Ram Charan Assets
దక్షిణాది నటులలో రామ్ చరణ్ అత్యంత ధనవంతుల నటుల జాబితాలో తను టాప్ లో ఉన్నాడు. తన నికర విలువ సుమారు రూ. 1370 కోట్లు ఉంటుందని సమాచారం. తన భార్య ఉపాసన కామినేని కొణిదలతో కలిపి దాదాపు రూ. 2500 కోట్ల నికర విలువ కలిగి ఉన్నాడు రామ్ చరణ్. తన ఇల్లు జూబ్లీ హిల్స్ లో ఉంది. ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. విలాసవంతమైన జీవన శైలిని తెలియ చేస్తుంది. తను తొలిసారిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత మూవీ ద్వారా తెరంగేట్రం చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది అనే మూవీలో నటిస్తున్నాడు.
రామ్ చరణ్ తన సినీ కెరీర్ తో పాటు రియల్ ఎస్టేట్, చలన చిత్ర నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాడు. జూబ్లీ హిల్స్‌లోని రూ. 38 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలు, అలాగే ఆస్టన్ మార్టిన్ , రేంజ్ రోవర్ వంటి ఖరీదైన ఆటోమొబైల్స్ ఒక్కొక్కటి 2-3 కోట్ల విలువైనవి ఉన్నాయి. ఇదిలా ఉండగా 2025 సంవత్సరం తనకు అచ్చి రాలేదనే చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ బొక్క బోర్లా పడింది. నిర్మాతకు కోలుకోలేని నష్టాన్ని తీసుకు వచ్చింది.
Also Read : Rakesh Roshan- Hero Hrithik-Krish 4 :దర్శకుడిగా మారిన స్టార్ హీరో