Ram Charan: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేను కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేను కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు

Hello Telugu - Ram Charan

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన… మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కలిశారు. ముంబయిలోని తన నివాసానికి వచ్చిన రామ్‌చరణ్‌ దంపతులకు సీఎం సాదర స్వాగతం పలికారు. సీఎంతో కలిసిన ఫొటోను ఉపాసన తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సీఎం ఏక్‌నాథ్‌ షిండే సైతం తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. రామ్‌చరణ్‌, ఉపాసనతో సమావేశం చాలా బాగా జరిగిందని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చిన రామ్‌చరణ్‌ దంపతులకు పుష్పగుచ్ఛంతో పాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు షిండే తెలిపారు. సినీ రంగంతో పాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో ఎక్ నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే, ఆయన సతీమణి వృశాలి కూడా ఉన్నారు.

Ram Charan – శంకర్ దర్శకత్వంలో శరవేగంగా ‘గేమ్ ఛేంజర్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నా సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో…. రామ్ చరణ్ తరువాత చిత్రం ఆర్‌సీ 16 గా ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి.

Also Read : Big Boss Prasanth: కన్నీటి పర్యంతం అవుతున్న బిగ్ బాస్ విన్నర్ తండ్రి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com