Ram Charan: టాలీవుడ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ డైరక్టర్లలో సుకుమార్ ఒకరు. సుకుమార్ సినిమా అంటే కూడికలు, తీసివేతలతో పాటు ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. అటువంటి సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘రంగస్థలం’. మ్యూజిక్ సన్సేషన్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ‘రంగస్థలం’ సినిమా సుకుమార్ కు మాత్రమే కాదు రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఓ మైలు రాయిగా నిలిచే సినిమా. అయితే ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. సుకుమార్ ప్రియ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే “RC16” సినిమా పూజా కార్యక్రమం వేదికగా దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయే తరువాత సినిమా గురించి త్వరలో అధికారిక సమాచారం రానున్నట్లు తెలుస్తోంది.
Ram Charan Movie Update
ప్రస్తుతం రామ్ చరణ్… శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో… రెండు రోజుల క్రితం ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే “RC16” (వర్కింగ్ టైటిల్) సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు. రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ సినిమా తరువాత “RC17” ను రామ్ చరణ్(Ram Charan)… దర్శకుడు సుకుమార్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్ – సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ నెల 27న రామ్‌చరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగానే ఆ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సుకుమార్… అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న పుష్ప2 ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… వరుసగా గురుశిష్యులు అంటే సుకుమార్, బుచ్చిబాబులకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : Director Atlee: ‘జవాన్2’పై స్పందించిన దర్శకుడు అట్లీ !