Ram Charan : చావు కబురు చల్లగా చెప్పారు దర్శకుడు బుచ్చిబాబు సన. తన దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఆర్సీ16. ఇందులో రామ్ చరణ్(Ram Charan) , జాన్వీ కపూర్(Janhvi Kapoor), మహేంద్ర సింగ్ ధోనీ, శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడుకుని ఉన్న సినిమా అని ఇప్పటికే ప్రకటించారు దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో చెర్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తను శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం గేమ్ ఛేంజర్ లో నటించాడు.
Ram Charan-Janhvi Kapoor Movie Updates
ఇది సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైంది. బొక్క బోర్లా పడింది. రూ. 500 కోట్ల ఖర్చు తో తీసిన ఈ చిత్రం విచిత్రంగా ఫెయిల్ కావడంతో తల్లడిల్లి పోయాడు నిర్మాత దిల్ రాజు. మరో వైపు తను నిర్మించిన మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది రూ. 330 కోట్లకు పైగా వసూలు చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న ఈ కొత్త మూవీ పైనే ఆశలు పెట్టుకున్నాడు చెర్రీ. కర్ణాటక పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27. వచ్చే ఏడాది 2026 లో దీనిని విడుదల చేయాలని నిర్ణయించారు మూవీ మేకర్స్. ఈ విషయం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అల్లా రఖా రెహమాన్ అందిస్తుండడం విశేషం. తను ఈ మధ్యనే ఆస్పత్రి పాలై బయట పడ్డాడు. దీంతో చెర్రీ, డైరెక్టర్, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూవీపైనే అందరి ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పూర్తి చేసే పనిలో పడ్డాడు. తను అనిల్ రావిపూడి దర్శకత్వంలో కథకు ఓకే చెప్పాడు. ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు టాక్. ఏది ఏమైనా చెర్రీ మూవీకి సంబంధించి అప్ డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుష్ లో ఉన్నారు.
Also Read : Beauty Tamannaah :నాగ సాధువుగా తమన్నా భాటియా