Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తొలిసారి తమ బిడ్డ క్లీంకారతో కలిసి ఆలయానికి వెళ్ళారు. తమ గారాల పట్టి క్లీంకారతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రామ్ చరణ్ కుటుంబానికి ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ కుమార్తె క్లీంకారతో కలిసి మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ram Charan in Temple
క్లీంకార జన్మించి నేటికి సరిగ్గా ఆరు నెలలు అయిన సందర్భంగా రామ్ చరణ్ దంపతులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్‌చరణ్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ముంబై అభిమానులు, భక్తులు పోటీ పడ్డారు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్రామీణ క్రీడ నేపథ్యం కలిగిన సినిమాలో నటించనున్నారు.
Also Read : Rajanikanth: ఏప్రిల్ నుంచి ‘తలైవర్ 171’