Game Changer : భారత దేశంలోనే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) కలెక్షన్ల పరంగా దూసుకు పోతోంది. సంక్రాంతి పండుగ సందర్బంగా సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు బరిలో ఉన్నా మెగా అభిమానులు మాత్రం భారీ ఎత్తున ఆదరిస్తున్నారు ఈ సినిమాను.
Game Changer Collections..
భారీ ఎత్తున ఖర్చు చేశారు ఈ సినిమా కోసం. దీనిని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (వెంకట రమణా రెడ్డి ) నిర్మించారు. ఆయన నిర్మించిన మరో సినిమా వెంకీతో అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఒకందుకు ఆయనకు బిగ్ ఊరటనిచ్చిందని చెప్పక తప్పదు.
గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా. పుష్ప -2 తర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన ఓపెనింగ్ సాధించింది. గత కొన్ని రోజులుగా కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల ఎదుర్కొన్న తర్వాత 5వ రోజు భారీ ఎత్తున వసూలు చేసింది. రూ. 10 కోట్లతో దేశీయ కలెక్షన్లలో రూ. 100 కోట్ల మార్కును దాటింది.
ప్రస్తుతం రూ. 106.15 కోట్లకు చేరుకుంది. శుక్రవారం 8.64 కోట్లు, శనివారం 8.43 కోట్లు, ఆదివారం 9.52 కోట్లు, సోమవారం 2.42 కోట్లు. మొత్తం రూ. 29.01 కోట్లు వసూలు చేసింది హిందీ వెర్షన్ లో. ఈ విషయాన్ని తరుణ్ ఆదర్ష్ వెల్లడించారు. తను బిగ్ ఫిలిం క్రిటిక్.
Also Read : Hero Rajinikanth-Jailer 2 : నెట్టింట వైరల్ అవుతున్న ‘జైలర్ 2’ టీజర్