Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు ఇవాళ. ఆయన మార్చి 27, 1985లో పుట్టారు. తన వయసు 39 ఏళ్లు. తనకు మరో పేరు కూడా ఉంది చెర్రీ అని. భార్య ఉపాసన కొణిదల. కూతురు క్లీంకారా. ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఒక్క సినిమా రామ్ చరణ్ తేజను(Ram Charan) గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ సినిమానే చిరుత. నటుడు మాత్రమే కాదు మంచి వ్యాపారేవత్త కూడా. తండ్రీ కొడుకుల ఆస్తులు కలిపి వేల కోట్లు ఉంటాయని అంచనా.
Today Global Star Ram Charan’s Birthday..
పోలో రైడింగ్ క్లబ్ ఓనర్ కూడా. రామ్ చరణ్ తేజకు సామాజిక పరంగా చేసిన సేవకు సంబంధించి వేల్స్ యూనివర్శటీ ఏప్రిల్ 13, 2024న గౌరవ డాక్టరేట్ ను అందించింది. ఇక ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన పాట నాటు నాటుకు ఆస్కార్ అవార్డు లభించింది. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ. ఆమె ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోదరి. చెర్రీకి ఇద్దరు చెల్లెళ్లు. శ్రీజ, సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్నాడు.
ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. ఆమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకునే ఉపాసన సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికిగాను నాట్హెల్త్ సీఎస్ఆర్ అవార్డు వరించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ లో నటించాడు. రాజమౌళి తీసిన మరో చిత్రం మగధీరలో నటించాడు. ఇది సూపర్ హిట్ అయ్యింది. సుకుమార్ తీసిన రంగస్థలంలో నటనకు మంచి పేరు వచ్చింది. అవార్డులు కూడా దక్కాయి.
Also Read : Mad Square Sensational : మ్యాడ్ స్క్కేర్ ట్రైలర్ మస్తుగుంది