Naayak : మెగా స్టార్ ఫ్యామిలీ అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు దర్శక, నిర్మాతలు. చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు మార్చి 27. దీంతో తను నటించిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ నాయక్(Naayak) తిరిగి రీ రిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇటీవలే తను నటించిన మూవీస్ లో విజయవంతమైన మూవీస్ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శక, నిర్మాతలు. ఇదిలా ఉండగా గతంలో తాను నటించిన నాయక్ బిగ్ సక్సెస్ అయ్యింది. బర్త్ డే గిఫ్ట్ గా ఇది మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Naayak Movie Re-Release Updates
ఈ మధ్యన పేరు పొందిన , విజయవంతం అయిన మూవీస్ అన్నీ తిరిగి రానుండడం విశేషం. మరికొన్ని థియేటర్లలోకి రాగా ఇంకొన్ని భారీ ధరకు అమ్ముడు పోయి ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక నాయక్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి దిగ్గజ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించాఉ. ఇది పూర్తిగా యాక్షన్, ఎంటర్టైనర్ గా తీశాడు. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ చిత్రానికి.
నాయక్ సినిమా 2013లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటించాడు. డ్యూయల్ రోల్ పోషించాడు. అందాల ముద్దుగుమ్మలు కాజల్ అగర్వాల్ , అమలా పాల్ కథా నాయికలుగా ఉన్నారు. కామెడీ కింగ్ మేకర్ గా పేరు పొందిన బ్రహ్మానందం ఇందులో దుమ్ము రేపాడు. మరోసారి తన నటనతో ఆకట్టుకునలా చేశాడు. ఇక ఎస్ఎస్ థమన్ ఇచ్చిన సంగీతం నాయక్ మూవీ సక్సెస్ లో కీలక భూమిక పోషించేలా చేసింది.
Also Read : Beauty Samantha :అతిథి పాత్రలో సమంత రుత్ ప్రభు