Ram Charan and Upasana: యావత్ ప్రపంచం ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే దేశంలోని రాజకీయ, సినీ, వ్యాపార, అధ్యాత్మిక ప్రముఖులకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానాలు అందజేస్తుంది. మరోవైపు యావత్ ప్రపంచం ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ప్రపంచ వ్యాప్తంగా లైవ్ స్ట్రీమిగ్ ను ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం. ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ దంపతులు, రాజ్‌కుమార్ హిరాణీ, రోహిత్ శెట్టి, ధనుష్ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నారు.
Ram Charan and Upasana Got Invitation
అయితే తాజాగా రామ మందిర ట్రస్ట్ ప్రతినిధులు… రామ్ చరణ్, ఉపాసన దంపతులను ఆహ్వానించారు. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్… హైదరాబాద్ లోని రామ్ చరణ్(Ram Charan) నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు పంచుకుంటున్నారు. దీనితో రామ్ చరణ్ దంపతులను రామ మందిర ట్రస్ట్ ఆహ్వానించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ శుక్రవారం ఓ సందేశం ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 11 రోజుల పాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భమన్నారు.
అయోధ్యలో జరగనున్న శ్రీరాముని పవిత్రోత్సవానికి వచ్చేవారు ఆకలితో వెనుదిరగకుండా ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 45 ప్రాంతాల్లో భోజనశాలలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు వివిధ రాష్ట్రాల వంటకాలను అందుబాటులో ఉంచననున్నారు. శ్రీరాముడి కోసం 2.5 కిలోల బంగారు విల్లును సిద్ధం చేస్తున్నారు. విల్లు, బాణాలను రాములవారి విగ్రహానికి అలంకరించనున్నారు.
Also Read : Salaar Sucess Party: బెంగుళూరులో ‘సలార్’ సక్సెస్ పార్టీ ! వైరల్ అవుతోన్న వీడియోలు