Rakul Preet Singh: పెళ్లిపీటలెక్కనున్న రకుల్ ?

పెళ్లిపీటలెక్కనున్న రకుల్ ?

Hello Telugu - Rakul Preet Singh

Rakul Preet Singh: కెరటం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి… వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, దృవ, ఖాకీ వంటి సినిమాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి రకుల్ ప్రీత్. అయితే గత రెండేళ్ళుగా సౌత్ సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ పంచాబీ బ్యూటీ… బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దాదాపు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరల సౌత్ సినిమాలపై దృష్టి సారించిన ఈ బ్యూటీ ప్రస్తుతం శంకర్ దర్వకత్వంలో ఇండియన్-2, శివకార్తికేయన్ సరసన అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు రకుల్ పెళ్లి వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ అమ్మడు త్వరలో అతనితో పెళ్ళి పీటలెక్కనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ కు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనితో రకుల్ అభిమానులు ఇప్పటి నుండే కొత్త దంపతులకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Rakul Preet Singh Marriage

బాలీవుడ్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే సమయం వచ్చినప్పుడు తప్పకుండా తమ వివాహం గురించి చెప్తామని గతంలో రకుల్‌(Rakul Preet Singh) స్పష్టతనిచ్చారు. ఇది ఇలా ఉండగా… జాకీ భగ్నా(Jackky Bhagnani)నీతో రకుల్ పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమైనట్లు బీ టౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో… కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగనుందని… ఆ తరువాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారంటూ పలు బాలీవుడ్ వెబ్‌సైట్స్‌ లో వరుస కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారడంతో సినీ ప్రియులు, నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆమె నటించిన ‘అయాలన్‌’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో ఆమె ప్రకటించారు.

Also Read : NTR Devara: ఎన్టీఆర్ ‘దేవర’ ఫస్ట్ గ్లింప్స్ రెడీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com