Rajit Patidar : యంగ్ స్టార్ క్రికెటర్ రజిత్ పాటిదార్ కు అరుదైన ఛాన్స్ దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు స్కిప్పర్ గా ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. 2021 నుంచి ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రజిత్ పాటిదార్(Rajit Patidar). ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించడంలో తనకు తనే సాటి. ప్రత్యేకించి తను విరాట్ కోహ్లీతో కలిసి మెరుగైన స్కోర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Rajit Patidar As a
ఈ ఏడాది మార్చి 20 తర్వాత టాటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీ జరగనుంది. ఎవరూ ఊహించని రీతిలో విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ తనకు కెప్టెన్సీ చేసేందుకు ఇష్టం లేదంటూ సుతిమెత్తగా మేనేజ్మెంట్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.
దీంతో జట్టుకు బలమైన నాయకత్వం అవసరమని భావించిన యాజమాన్యం చివరకు రజిత్ పాటిదార్ ను ఎంపిక చేసింది. తను దేశీ వాలి సయ్యద్ ముస్తాక్ అలీ, దులీప్ ట్రోఫీ టోర్నీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు . ఆ అనుభవం ప్రస్తుతం జరగబోయే ఐపీఎల్ కు పనికి వస్తుందని భావించింది టీం మేనేజర్స్.
ఇదిలా ఉండగా గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలం పాటలో ఆర్సీబీ ఏకంగా రజిత్ పాటిదార్ ను రూ. 11 కోట్లకు చేజిక్కించుకుంది.
Also Read : Beauty Nora-Kanchana 4 :’కాంచన4′ షూటింగ్ లో నోరా ఫతేహి బిజీ