Jailer 2 : తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు తలైవా రజనీకాంత్. తను నటించిన జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యావత్ దేశాన్ని ఊపేసింది. ఇదే సమయంలో సన్ ఇంటర్నేషనల్ మరోసారి కీలక అప్ డేట్ ఇచ్చింది. జైలర్ చిత్రానికి సీక్వెల్ గా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ కొనసాగుతోంది. తనను డిఫరెంట్ జానర్ లో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. జైలర్ 2(Jailer 2) మూవీ షూటింగ్ రాకెట్ కంటే స్పీడ్ గా చిత్రీకరణ జరుగుతోంది.
Rajinikanth Jailer 2 Movie Updates
అయితే ఈ మూవీని ఎలాగైనా సరే ఈ ఏడాది 2025లో కానీ లేదా 2026 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు మూవీ మేకర్స్. జైలర్ ను రజనీకాంత్ తో నెల్సన్ దిలీప్ కుమార్ తీశాడు. దీనికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కానుంది. కీలకమైన సన్నివేశాలను రజనీకాంత్ తో తీస్తున్నాడు దర్శకుడు. తలైవా నటన సినిమాకు హైలెట్ గా నిలవనుందని సమాచారం.
జైలర్ 2లో రజనీకాంత్ ను డిఫరెంట్ స్టైల్ లో చూపిస్తున్నాడు. తలైవా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జైలర్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తళుక్కున మెరిసింది. రజనీకాంత్ తో జతకట్టింది. అయితే తాజా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో బజ్ పెరిగేలా చేసింది. మొత్తంగా తలైవా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
Also Read : Popular Actor Sunny Deol :బాలీవుడ్ ను షేక్ చేస్తున్న జాట్