భారత దేశ సినీ చరిత్రలో ఇద్దరూ ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్ . ఇంకొకరు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఏ పాత్ర ఇచ్చినా దానిలో లీనమయ్యే టాలెంట్ కలిగిన నటులు. బాలీవుడ్ లో ఇప్పటికీ నెంబర్ వన్ గా నిలిచారు బిగ్ బి.
తమిళ సినీ చరిత్రలో మోస్ట్ పాపులర్ హీరో తలైవా. ఇద్దరూ 70 ఏళ్లు దాటిన వారే. కానీ తమ కాలంలో ఎంతో మంది కొత్తగా హీరోలు ముందుకు వచ్చినా వారి స్టార్ ఇమేజ్ ను దాటలేక పోతున్నారు. రజనీకాంత్ తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు సాధించింది.
ఈ చిత్రం తన కెరీర్ లో మరిచి పోలేనని పేర్కొన్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం కేరళలో కొత్త మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సుదీర్ఘ కాలం తర్వాత 33 ఏళ్ల అనంతరం రజనీకాంత్ , అమితాబ్ బచ్చన్ కలిసి నటించనున్నారు.
జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రంలో ఇద్దరూ కీలక పాత్రల్లో నటించనున్నారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ సందర్బంగా రజనీకాంత్.