Rajinikanth : ఈ మధ్యన ఫ్యాన్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుంది. సినిమా రంగానికి సంబంధించి హీరో హీరోయిన్ల పేరుతో ఫ్యాన్స్ సంఘాలు ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాడ్యం దక్షిణాదికి కూడా పాకింది. సినిమాల రిలీజ్ రోజు సందడి చేయడం, కేకులు కట్ చేయడం, కటౌట్లు పెట్టడం, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం దాకా పెరిగింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది తమిళ చలన చిత్ర పరిశ్రమ గురించి. ఇక్కడ ఉన్నంత పోటీ ఇంకెక్కడా ఉండదేమో.
Rajinikanth Warns…
ఈ మధ్యన సోషల్ మీడియా రావడంతో ఈ విద్వేషం, మితి మీరిన అభిమానం పరాకాష్టకు చేరుకుంది. ఆయా హీరోల ఫ్యాన్స్ ఒకరిపై మరొకరు బురద చల్లు కోవడం విస్తు పోయేలా చేసింది. కొన్ని చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అక్కడ నటి ఖుష్బూకు గుడి కూడా కట్టేశారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. తన స్టార్ డమ్ ఈ మధ్యన భారీగా పెరిగింది.
మరో వైపు ఎవరు రియల్ హీరో, సూపర్ స్టార్ అంటూ కూడా చర్చ కూడా పెట్టేశారు. గత కొంత కాలంగా ఎక్కడ ఈవెంట్స్ జరిగినా రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ , తదితర నటులు తామంతా ఒక్కటేనని ప్రకటిస్తూ వచ్చారు.
అయినా ఫ్యాన్స్ ఆగడం లేదు. తాజాగా రజనీకాంత్ అభిమాని ఒకరు ఎక్స్ వేదికగా విజయ్ పై నోరు పారేసుకున్నాడు. దీనిపై రజనీ టీం సీరియస్ గా స్పందించింది. వ్యక్తిగత ద్వేషం పనికి రాదంటూ పేర్కొన్నారు. ఎవరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, తనకు విజయ్ కు మధ్య బలమైన స్నేహ బంధం ఉందన్నాడు రజనీకాంత్.
Also Read : Beauty Sanya Malhotra :సన్యా మల్హోత్రా ‘మిసెస్’ హల్ చల్