తమిళ సినీ రంగంలో తనకు ఎదురే లేదని నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్. తాజాగా తలైవార్ 170 పేరుతో కొత్త చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ ఆకట్టుకునేలా రజనీకాంత్ స్టిన్నింగ్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో లుక్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కించేలా చేస్తోంది.
రజనీకాంత్ పోస్టర్ లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కొద్ది సేపటి కిందట షూటింగ్ ప్రారంభమైందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సాక్ష్యమే ఫస్ట్ లుక్. మరో వైపు ఈ ఏడాది రజనీకాంత్ కు అచ్చొచ్చిందని చెప్పక తప్పదు.
సన్ పిక్చర్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 650 కోట్లు వసూలు చేసింది. తన కెరీర్ లో ఇది మరిచి పోలేని సినిమా అని పేర్కొన్నాడు. మరో వైపు కీలక పాత్రలో నటించిన లాల్ సలామ్ కూడా ఇదే ఏడాది రానుంది.
ఇక టి. జ్ఞాన వేల్ దర్శకత్వంలో కొత్త మూవీ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసినట్టు టాక్. ఏది ఏమైనా రజనీనా మజాకా అంటున్నారు అభిమానులు.