Coolie : లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ(Coolie). ఇందులో కీలక పాత్ర పోషించాడు తలైవా రజనీకాంత్. దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాడు. ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డ్ సృష్టించింది. విడుదలకు ముందే భారీ బజ్ సృష్టిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, శ్రుతి హాసన్ , పూజా హెగ్డే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Rajinikanth Coolie Telugu Rites
భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ కూలీ మూవీపై. తెలుగు పంపిణీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. పలు నిర్మాణ సంస్థలు , నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నాయి. పోటీలో ఆసియన్ సినిమాస్ సునీల్ , సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ రూ. 40 కోట్లకు పైగా ప్రత్యక్ష ఆఫర్ చేసినట్లు సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇది ఇతర బిడ్డర్లకు అధిక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగు హక్కులను సుమారు రూ.9 కోట్లకు పొందింది. ఈ కంపెనీ గతంలో లియో , దేవర హక్కులను సొంతం చేసుకుంది. కూలీ కోసం మరో హై-స్టేక్స్ పోరులో చిక్కుకుంది. కూలీ సినిమాపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో, దాని తెలుగు పంపిణీ హక్కులు రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : Samantha Love Story :సమంత..రాజ్ నిడిమోరు ప్రేమలో పడ్డారా..?