Rajinikanth : విక్టరీ వెంకటేశ్, ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మానవ, కుటుంబ సంబంధాల గురించి ఇందులో ప్రత్యేకంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కథతో పాటు మ్యూజిక్ పరంగా మంచి ఆదరణ చూరగొంది.
Rajinikanth Rejects Father Role
ఇటు థియేటర్లలోనే కాకుండా బుల్లి తెరపై కూడా ఇప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఓ వైపు అతడు, ఇంకో వైపు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు పోటాపోటీగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.
ఇక విషయానికి వస్తే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన చిట్ చాట్ సందర్బంగా రజనీకాంత్(Rajinikanth) ను తండ్రి పాత్ర కోసం అనుకున్నామని అన్నాడు. తాను చెన్నై వెళ్లి కథకు సంబంధించి 40 నిమిషాలు చెప్పానని ,అంతా విన్నాక తాను నటించ లేనంటూ చెప్పారని తెలిపారు. ఇందుకు కారణం తాను ఆరోగ్యంగా లేక పోవడమేనని కానీ మంచి పాత్రను తాను మిస్ అవుతున్నానని వాపోయారని ఈ సందర్బంగా చెప్పారు దర్శకుడు.
ఒకవేళ రజనీకాంత్ ఓకే చెప్పి ఉంటే తను మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కు తండ్రిగా అయి ఉండేవారు సినిమాలో. గొప్ప ఛాన్స్ మిస్ అయ్యిందని ఇప్పటికీ తాను బాధ పడుతుంటారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, తల్లి పాత్రలో జయసుధ నటించింది.
Also Read : Madras High Court Shocking : బ్యాడ్ గర్ల్ సర్టిఫికేషన్ నిలుపుదల కుదరదు