Hero Rajinikanth: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రజనీ లాల్‌ సలాం ?

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రజనీ లాల్‌ సలాం ?

Hello Telugu - Rajinikanth

Rajinikanth: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా ‘లాల్‌ సలాం’. ఈ సినిమాలో తలైవా రజనీకాంత్(Rajinikanth)…. మొయిద్దీన్‌ భాయ్‌ గా అతిథి పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో పిల్‌ దేవ్‌, జీవిత అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది.

‘జైలర్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్… తరువాత ‘లాల్‌ సలాం’ గా వస్తుండటంతో తలైవా అభిమానులు ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గాని ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Rajinikanth – ‘లాల్‌ సలాం’ వాయిదాకు గల కారణాలేంటి ?

‘లాల్‌ సలాం’ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించడానికి కారణం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఈ సినిమాపై పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాకపోవడం దీనికి కారణమనే టాక్ వినిపిస్తోంది. దీనికి రజనీకాంత్‌(Rajinikanth) ఇందులో అతిథి పాత్రలో కనిపించడమే అని ప్రధాన కారణం అని తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్రాంతికి చాలా వరకు భారీ సినిమాలు ఉన్నాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’ చిత్రాలు కోలీవుడ్‌లో రెడీగా ఉన్నాయి.

ఇక టాలీవుడ్‌ కు వస్తే గుంటూరు కారం, ఈగల్‌, నా సామిరంగా, సైంధవ్‌, హనుమాన్‌ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని పరిస్థితి టాలీవుడ్‌లో ఉంది. ఇలాంటి టైమ్‌లో మరో మూడు తమిళ సినిమాలు అంటే థియెటర్ల కొరత ఏర్పడటం జరుగుతుందని లాల్‌ సలాం టీమ్‌ ఆలోచిస్తుందట. దీనితో ‘లాల్‌ సలాం’ వెనక్కు తగ్గడమే మేలని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించడంతో… తేడా వస్తే బిజినెస్‌పై ప్రభావం పడుతుందని భావించిన మేకర్స్‌ ఫైనల్‌గా పొంగల్‌ నుంచి డ్రాప్ కావడమే బెటర్‌ అని నిర్ణయించుకున్నారట. అంతేకాదు కొద్దిరోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు కూడా తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.

Also Read : Salaar: ‘సలార్‌’ ఫస్ట్ డే కలెక్షన్స్‌ ఎంతంటే!

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com