Rajinikanth Laal Salaam : తమిళ సినీ ప్రపంచంలో తలైవా రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా రికార్డు సృష్టించారు సూపర్ స్టార్. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ పనిగట్టుకుని తన తండ్రితో సినిమా చేస్తోంది. ఆ చిత్రం పేరే లాల్ సలామ్. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Rajinikanth Laal Salaam Viral
ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ మొయితీన్ భాయ్ గా నటిస్తుండడం విశేషం. చిత్ర కథ విషయానికి వస్తే తలైవా డాన్ గా నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం చిత్రం షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది ఐశ్యర్య రజనీకాంత్.
లాల్ సలామ్ కు సంబంధించి రజనీకాంత్(Rajinikanth) తో కూడిన న్యూ పోస్టర్ ను ఈ ఏడాది మే 8న మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి రెండు షెడ్యూల్స్ పూర్తయినట్లు టాక్. ఇక లాల్ సలామ్ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ముంబై నేపథ్యంగా సాగనుంది. ఇందులో తలైవా రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్ , విక్రాంత్ లాల్ , ఐశ్వర్య రజనీకాంత్ నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా రజనీకాంత్ కూతురు గతంలో ధనుష్ నటించిన 3, వేయి రాజా వేయి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. ఇదే ఊపుతో లాల్ సలామ్ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
Also Read : Jawan Create : రిలీజ్ కంటే ముందే రికార్డ్