Jailer 2 : తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్- 2 సీక్వెల్ మూవీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రికార్డుల మోత మోగించింది జైలర్ చిత్రం. దీంతో సీక్వెల్ ను ప్రకటించాడు దర్శకుడు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఎప్పటి లాగే స్పెషల్ సాంగ్ లో అలరించనుంది మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.
Jailer 2 Teaser Promo..
గత ఏడాది కొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కు ఉన్నట్టుండి ఆక్సిజన్ లా జైలర్ ఆదుకుంది. ఊహించని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ దక్కింది. ఒక రకంగా చెప్పాలంటే కోట్ల వర్షం కురిసింది. నిర్మాతలు సైతం భారీ బహుమతులు అందించారు సినిమా యూనిట్ మొత్తానికి . ఇది కూడా ఓ రికార్డే నని చెప్పక తప్పదు.
జైలర్ మూవీలో తలైవాతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ , బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ , మలయాళ సూపర్ హీరో మోహన్ లాల్ తళుక్కున మెరిశారు. మరో వైపు టాలీవుడ్ నట సింహం బాలయ్య కూడా జైలర్ -2 చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు కోలీవుడ్ లో టాక్.
భారీ బడ్జెట్ తో జైలర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేసింది సన్ పిక్చర్స్ సంస్థ. పెట్టిన డబ్బులకంటే ఎక్కువ వసూళ్లు కావడంతో మరోసారి సీక్వెల్ కు ప్లాన్ చేశారు. ఇప్పుడు జైలర్ కంటే భారీ బడ్జెట్ తో జైలర్ 2ను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు నెల్సన్.
Also Read : Hero Rishab Shetty : రిషబ్ శెట్టి న్యూ లుక్ కెవ్వు కేక