Rajinikanth : మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత సోమవారం రాత్రి ఉన్నట్టుండి అస్వస్థతకు లోనైన రజనీకాంత్‌ను ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరిశీలించిన వైద్యులు గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడడంతో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా అయనకు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు.
Rajinikanth Discharged…
ఇదిలాఉండగా రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్, కూలీ సినిమాల్లో నటిస్తుండగా వెట్టయాన్ ఆక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.
Also Read : Pawan Kalyan : తమిళ నటుడు యోగిబాబు నటనను ప్రశంసించిన పవన్