Rajinikanth: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా నటించిన చిత్రం కూలీ. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మినిమం గ్యారెంటీ కలిగిన అరుదైన నటుడు రజనీకాంత్. మూవీ మేకర్స్ ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా అంచనాలు పెంచుతున్న మరో బాలీవుడ్ మూవీ వార్ 2 . ఇది గతంలో తీసిన వార్ చిత్రానికి సంబంధించిన సీక్వెల్. ఇందులో కీలకమైన రోల్ పాశిస్తున్నాడు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోశన్ తో కలిసి అద్బుతంగా డ్యాన్స్ చేశాడు.
Rajinikanth Coolie vs War 2 Movie
ఇదే సమయంలో కూలీ(Coolie) మూవీ కూడా ఆగస్టులో రావడం, దీనికి పోటీగా వార్ 2 రావడంతో పెద్ద ఎత్తున క్లాస్ అయ్యే ఛాన్స్ ఉందని, దీంతో ప్రేక్షకులు విడి పోయే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా. ఒకే రోజున విడుదల చేస్తారా లేక మారుస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గత ఏడాది రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన జైలర్ మూవీ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం జైలర్ -2 సీక్వెల్ కూడా కొనసాగుతోంది. ఇదే సమయంలో కూలీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే కూలీ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ దుమ్ము రేపింది. రజనీకాంత్ స్టైల్ ఆకట్టుకునేలా ఉంది. కోలీవుడ్ లో అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రంగా పేర్కొంటున్నారు సినీ ప్రేమికులు. రజనీకాంత్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా మరో ప్రాజెక్టులో పాల్గొంటున్నాడు. తొలుత కూలీని ఆగస్టు 14న రిలీజ్ చేయాలని భావించారు. లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ లేక పోలేదు. అయితే కూలీ, వార్ 2 రెండూ భారీ చిత్రాలు కావడంతో తేదీలను మార్చేందుకు అవకాశం ఉంది.
Also Read : Lamp Movie Interesting :ఆసక్తి రేపుతున్న ల్యాంప్