Dragon : చెన్నై – తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలుసుకుంది డ్రాగన్ మూవీ బృందం . ఈ సందర్బంగా తలైవా ప్రత్యేకించి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇదే సమయంలో కథను సూపర్ గా చెప్పిన తీరు పట్ల కూడా దర్శకుడు మారిముత్తును అభినందించారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని తీయాలని ఆకాంక్షించారు.
Rajinikanth Congratulate Dragon Movie Team
ఇదిలా ఉండగా రైజింగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ తన సినీ కెరీర్ లో అద్భుత విజయాన్ని ఈ చిత్రం ద్వారా సాధించారు. ఏకంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటేసింది. డ్రాగన్(Dragon) ను ఇటు తమిళంలో అటు తెలుగులో విడుదల చేశారు. కాగా తెలుగులో మాత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా రిలీజ్ అయ్యింది.
రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో నటించిన హీరోయిన్ కాయదు లోహర్ కు విపరీతమైన పాపులారిటీ లభించింది. ఆమెకు తెలుగులో బంపర్ ఆఫర్ వచ్చేసింది. అనుదీప్ దర్శకత్వం వహించే చిత్రంలో విశ్వక్ సేన్ తో జత కట్టనుంది.
ఇక డ్రాగన్ చిత్రంలో లోహర్ తో పాటు ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ కూడా కీలక పాత్రలో నటించింది..మెప్పించింది. ప్రత్యేకించి కయాదు లోహర్ తో పాటు ప్రదీప్ రంగనాథన్ కుర్రకారు గుండెల్లో నిలిచి పోయారు. ఈ సందర్బంగా రజనీకాంత్ ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు నటుడు . తానే స్వయంగా ఫోటోలను షేర్ చేశాడు.
Also Read : Santhana Prapthirasthu Sensational :శుభమస్తు ‘సంతాన ప్రాప్తిరస్తు’