Rajanikanth: ‘జైలర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్… వరుస సినిమాలతో జోరు పెంచారు. తలైవా ప్రస్తుతం జై భీమ్ ఫేం T. J. జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయన్ తో పాటు తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మూడో సినిమాకు సిద్ధమైపోయారు తలైవా రజనీకాంత్(Rajanikanth). ఖైదీ, విక్రమ్, లియో వంటి వరుస హిట్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘తలైవర్ 171’ (వర్కింగ్ టైటిల్) లో నటించడానికి సిద్ధమయ్యారు.
Rajanikanth Movie Updates
వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు దర్శకుడు లోకేష్ కనగరాజ్… ఇటీవల ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘స్క్రిప్ట్‌వర్క్ పూర్తైంది. చాలా ఏళ్ల తర్వాత రజనీ సార్ ఇందులో పూర్తిస్థాయిలో యాక్షన్ చేయనున్నారు. మా కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్టు మొదలవుతుందని తెలియగానే కమల్ సర్ మొట్టమొదట ఫోన్ చేసి గుడ్‌లక్ చెప్పారు’ అంటూ దర్శకుడు లోకేష్ ఆ ఇంటర్వూలో తెలిపారు. మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి.
Also Read : Hema Choudhary: విషమంగా సీనియర్ నటి హేమా చౌదరి ఆరోగ్యం