Rajanikanth: ‘వెట్టయాన్‌’ ను పూర్తి చేసిన తలైవా !

‘వెట్టయాన్‌’ ను పూర్తి చేసిన తలైవా !

Hello Telugu - Rajanikanth

Rajanikanth: ‘జై భీమ్’ సినిమా ఫేం టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘వెట్టయాన్‌’. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికాసింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘వేట్టయాన్ ’ పై అభిమానులకు భారీగా అంచనాలు ఉన్నాయి. ‘జైలర్‌’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత… బూటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారిగా రజనీకాంత్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. దీనితో ఈ సినిమా కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rajanikanth Movies

ఈ నేపథ్యంలో ‘వేట్టయాన్‌’ సినిమాలో తన భాగం చిత్రీకరణని పూర్తి చేశారు రజనీకాంత్(Rajanikanth). ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. దర్శకుడు, చిత్రబృందం రజనీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఫొటోని అందులో పంచుకుంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దీనితో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ‘వేట్టయాన్‌’ని పూర్తి చేసిన రజనీ, త్వరలోనే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రం కోసం రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత ‘జైలర్‌ 2’ పట్టాలెక్కుతుంది. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్‌. ఒకవైపు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేస్తూ… మరోవైపు కొత్త చిత్రాల్ని పట్టాలెక్కిస్తూ మెరుపు వేగం ప్రదర్శించడం గమనార్హం.

Also Read : Prabhas : ప్రభాస్ ఆ పాన్ ఇండియా సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com