Raja Saab : మారుతి దర్శకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న డార్లింగ్ ప్రభాస్ చిత్రం రాజా సాబ్(Raja Saab). ఇప్పటికే శర వేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎలాగైనా సరే త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు దర్శకుడు. ఈ మేరకు ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన లుక్స్, పోస్టర్స్ కు భారీ ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున ప్రభాస్ ను ప్రేమిస్తున్నారు.
Raja Saab Movie Shooting Updates
చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ లవర్ బాయ్ గా నటించనుండడం విశేషం. అంతకు ముందు తను వర్షం, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రంలో నటించాడు. ఆ సినిమాలు తనకు ఎంతో పేరు తీసుకు వచ్చేలా చేశాయి. ఇక మిర్చి అయితే తనను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేసింది.
ప్రస్తుతం డిఫరెంట్ కథతో ముందుకు వస్తున్నాడు రాజా సాబ్ గా. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పూర్తిగా హర్రర్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. ఇందులో ప్రభాస్ సరసన మలయాళ బ్యూటీ క్వీన్ మాళవిక మోహన్ కథానాయకిగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ తొలిసారి కావడం విశేషం.
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం చిత్ర బృందం చివరి షెడ్యూల్ మిగిలి ఉంది. ఇందు కోసం టీం స్పెయిన్ కు వెళ్లనుంది. అక్కడ రెండు పాటలను చిత్రీకరించనున్నారు. రాజా సాబ్ 3 గంటల రన్ టైమ్ కలిగి ఉంటుందని ప్రకటించాడు మారుతి. ముందుగా ఏప్రిల్ 10 అనుకున్నారు. ఇంకొంచెం వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్.
Also Read : Murugadas-Sikandar Success :సికిందర్ సక్సెస్ ఖాయం