Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ, మలయాళం భాషలలో 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్(Raja Saab) విడుదల అవుతుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు రివీల్ చేశారు.
Raja Saab Movie Updates
సోమవారం ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ పేరుతో స్పెషల్ వీడియోను విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఓ క్లాస్ లుక్‌లో కనిపించారు. తాజాగా విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు అందరూ డార్లింగ్ ఈజ్ రిటర్న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ గ్లింప్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వింటేజ్ కారు ముందు ప్రభాస్ పింక్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. “రాజా సాబ్” సినిమాలో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా “రాజా సాబ్” మూవీని రూపొందిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది.
Also Read : Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల వేడుకలో స్టేజ్ పై స్టెప్ వేసిన భాగ్యశ్రీ బోర్సే !