Raj Tarun : రాజ్‌తరుణ్ కుటుంబ సభ్యులు మాదాపూర్ పీఎస్‌కు వెళ్లారు. లావణ్య తమ ఇంటికి వచ్చి బెదిరించిందని.. ఇబ్బందులకు గురి చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని, తమకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని.. ఈ ఫిర్యాదులో తెలిపారు. లావణ్య వల్ల రాజ్‌తరుణ్(Raj Tarun) పేరెంట్స్‌కు ప్రాణహాని ఉందని రాజ్‌తరుణ్ లాయర్ మధుశర్మ ఆరోపించారు. ఆమెకు నేర చరిత్ర ఉందన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు ప్రొటెక్షన్ కావాలనీ, న్యాయపరంగా పోరాడుతామని రాజ్‌తరుణ్ లాయర్ మధుశర్మ చెప్పారు.
Raj Tarun Family Approached
లావణ్య కేసులో టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్(Raj Tarun) పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. లావణ్య మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. విచారణకు హజరుకావాంటూ నోటీసులు ఇచ్చారు.
తన బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ పోలీసులకు లేఖరాశారు. ఇప్పడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు లావణ్య వల్ల తమకు ప్రాణ హానీ ఉందంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో రాజ్ తరుణ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. లావణ్యకు నేరచరిత్ర ఉంది.. కాబట్టి తమను ఏమైనా చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఆరోగ్యం సరిగ్గాలేదని కంప్లైంట్ తెలిపారు. కాకతీయ హిల్స్ లోని తమ ఇంటికి వచ్చిన లావణ్య న్యూసెన్స్ చేసిందని.. డోర్స్ తీయాలంటూ పెద్ద పెద్దగా అరుస్తూ తలుపులను గట్టిగా కొట్టిందని కంప్లైంట్ చేశారు. కనుక తమకు ప్రొటెక్షన్ కావాలని మాదాపూర్ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు. లావణ్యపై అన్ని ఆధారాలు ఉన్నాయని.. అన్ని కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. ప్రతీ చోట విమెన్ విక్టిమ్ కార్డ్ పని చేయదన్నారు రాజ్ తరుపు లాయర్.
Also Read : Wayanad Landslide : వారి గొప్ప మనసును చాటుకున్న హీరో సూర్య ఫ్యామిలీ