బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు శిల్పా శెట్టిని. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు కూడా. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఓ జట్టులో భాగస్వామ్యంగా ఉన్నారు.
పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉన్నారు రాజ్ కుంద్రా. అయితే శిల్పా శెట్టి ఫ్యామిలీ తల దించుకునేలా రాజ్ కుంద్రా పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఇద్దరూ స్టార్ కపుల్స్ గా గుర్తింపు పొందారు. ఇదే సమయంలో పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఒక్కసారిగా విస్తు పోయింది బాలీవుడ్. ఆ తర్వాత జైలుకు వెళ్లారు. ఈ కష్ట కాలంలో నటి శిల్పా శెట్టి ఎక్కడా మనో ధైర్యాన్ని కోల్పోలేదు. ఇదే సమయంలో తన పంథాను మార్చుకుంది. సినిమాలలో కాకుండా బుల్లి తెరపై తను పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. అంతే కాదు కొన్ని షోస్ కు హోస్ట్ గా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.
ఇదే సమయంలో గత కొంత కాలం నుంచి రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి విడి పోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిని నిజం చేస్తూ ఇవాళ రాజ్ కుంద్రా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. తాము విడి పోతున్నామని తమను ఆశీర్వదించాలని కోరారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.