Raj kummar Rao : భారతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన , దమ్మున్న కెప్టెన్ గా గుర్తింపు పొందాడు పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరవ్ గంగూలీ. తనకు లెక్కలేనంత మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. నడకలోనూ, నడతలోనూ ఆటలోనూ, అన్నింటా రాజసం ఉట్టిపడే వ్యక్తిత్వం తనది. బీసీసీఐ కార్యదర్శిగా పని చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ కు మెంటార్ గా ఉన్నాడు.
Raj kummar Rao-Sourav Ganguly Biopic
గత కొంత కాలంగా సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రాబోతోందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే క్రికెట్ జగత్తులో టాప్ క్రికెటర్ల జీవిత చరిత్రలు వచ్చాయి. 1983లో తొలిసారిగా ప్రపంచ వరల్డ్ కప్ ను తీసుకు వచ్చిన ఘనత కపిల్ దేవ్ కు దక్కుతుంది. తనపై కూడా బయో పిక్ వచ్చింది. ఇక ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ కలిగిన , మణికట్టు మాంత్రికుడిగా పేరు పొందిన మహమ్మద్ అజహరుద్దీన్ పై కూడా బయో పిక్ వచ్చింది.
తన సారథ్యంలోనే భారత్ లెక్కలేనన్ని విజయాలు దక్కాయి. తన హయాంలోనే గంగూలీ వచ్చాడు. తనకు గురువుగా అజ్జూ భాయ్ ని భావిస్తాడు. ఇదే సమయంలో గంగూలీ జీవితంలో నేర్చు కోవాల్సినవి చాలా ఉన్నాయి. తను భారతీయ క్రికెట్ ను ఒక రేంజ్ కు తీసుకు వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఇక తాజాగా గంగూలీ బయో పిక్ గురించి అప్ డేట్ వచ్చింది. తన పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు(Raj Kummar Rao) నటిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి విక్రమ్ ఆదిత్యా మొత్వానీ దర్శకత్వం వహిస్తుండగా లవ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
Also Read : Hero Vijay Movie : 26న దళపతి విజయ్ మూవీ ఫస్ట్ లుక్