Hero Charan : పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్(Hero Charan) ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇటీవలే తను శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ విడుదలైంది. ప్రస్తుతం ఆర్సీ16 టీమ్ లో పని చేస్తున్నాడు. దీనికి ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది.
Hero Charan – AR Rahman Movie Updates
ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి కీలకమైన అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. పనిగట్టుకుని చెర్రీ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేశారంటూ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు బుచ్చిబాబు సనా.
రామ్ చరణ్ మూవీ చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా డైరెక్టర్ సాంకేతిక నిపుణులు ఎవరెవరు ఉంటారనే విషయాన్ని ప్రకటించారు. తమ సినిమాకు వరల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అల్లా రఖా రెహమాన్ (ఏఆర్) సంగీతం అందిస్తారని స్పష్టం చేశారు.
అయితే దర్శక నిర్మాతలు, రెహమాన్ మధ్య మనస్ఫర్థలు వచ్చాయని, అందుకే తనను మార్చేశారని, ఆయన స్థానంలో ఇండియన్ రాక్ స్టార్ పుష్ప, పుష్ప-2 మూవీస్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను పెట్టుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు. అలాంటివన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేశారు. రెహమానే తమ మూవీకి సంగీతం ఇస్తారంటూ వెల్లడించారు.
Also Read : Hero Vijay Movie : ‘దళపతి 69’ టైటిల్..ఫస్ట్ లుక్ రిలీజ్