Raghubabu : డాక్టర్ మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న భక్తి ప్రధానమైన సినిమా కన్నప్ప. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు రఘుబాబు. కన్నప్పలో(Kannappa) తాను మల్లు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా వారంతా ఆ పరమ శివుడి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగా నటుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Raghubabu in Kannappa Movie
మరింత భయ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇందులో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు, డార్లింగ్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్ర నటులు నటిస్తుండడం విశేషం. రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. ఇది విష్ణు కలల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. భారీ ఎత్తున ఖర్చు చేసి తీశారు. టీజర్ ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ ఆవిష్కరించారు .
కన్నప్ప మూవీ ఏప్రిల్ 24వ తేదీన థియేటర్ల లోకి రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మంచు విష్ణు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్ఆయనర్ లపై డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మించిన చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రఘుబాబు పోషించిన మల్లు పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. గతంలో శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి మాతగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించిన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read : Hero Nani-Paradise :నాని ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఫిక్స్