Raghu Thatha: ఓటీటీలోనికి కీర్తి సురేశ్‌ కొత్త మూవీ ‘రఘుతాత’ !

ఓటీటీలోనికి కీర్తి సురేశ్‌ కొత్త మూవీ ‘రఘుతాత’ !

Hello Telugu - Raghu Thatha

Raghu Thatha: మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రఘుతాత(Raghu Thatha)’. ‘కేజీఎఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాతో త‌మిళ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. అంతే కాదు ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి బాలీవుడ్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ లకు కథా రచయితగా పని చేసిన సుమన్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించాడు. రవీంద్ర విజ‌య్, ఎమ్మెస్ భాస్కర్, స‌మి, దేవ‌ద‌ర్శిణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించి… ట్రైల‌ర్ కూడా వ‌దిలారు. అయితే అనివార్య కారణాల వలన తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. అయితే తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాకముందే దీనిని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 13న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక కొత్త పోస్టర్‌ ను విడుదల చేసింది.

Raghu Thatha – ‘రఘుతాత’ కథేమిటంటే ?

1960ల కాలం నాటి నేపథ్యంలో మూవీని రూపొందించారు. హిందీ వ్యతిరేక ఉద్యమం, రాజకీయ అంశం చుట్టూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. 1960 నేప‌థ్యంలో నాడు హిందీ భాషను మహిళలపై బలవంతంగా రుద్దడంపై సెటైరిక్ పంచులు వేస్తూ కామెడీ టచ్‌ తో ఈ సినిమాను రూపొందించారు. కాయ‌ల్ పాండియ‌న్ ఓ బ్యాంక్‌ లో క్ల‌ర్క్‌గా ప‌ని చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ప‌దోన్న‌తి వ‌చ్చే క్ర‌మంలో హిందీ భాష త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి ఉండాలని స‌ద‌రు బ్యాంకు ష‌ర‌తు పెడుతుంది. దీంతో అప్ప‌టికే బాగా ఫెమినిస్ట్ , రెబ‌ల్ ల‌క్ష‌ణాలు ఉన్న కాయ‌ల్ ఆ ష‌ర‌తును వ్య‌తిరేకిస్తుంది. అదే స‌మ‌యంలో ఆమె లైఫ్‌ లోకి సెల్వ‌న్ అనే ఇంజినీర్ రాగా త‌న జీవితం మ‌లుపు తిరుగుతుంది. సెల్వ‌న్‌ ను త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని చూస్తుంది. ఈ నేప‌థ్యంలో కాయ‌ల్ తిరిగి హిందీని ఎందుకు నేర్చుకోవాల‌నుకుంది, చివ‌ర‌కు నేర్చుకుందా లేదా, అస‌లు సెల్వ‌న్ ఎవ‌ర‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాతో సినిమా సాగుతుంది.

సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఫీల్ గుడ్‌గా న‌డుస్తూ చూసే ప్రేక్ష‌కుల‌ను సినిమాలోకి తీసుకోళుతుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా మంచి సెటైరిక్ డైలాగులు, కీర్తి సురేశ్‌, ర‌వీంద్ర విజయ్ న‌ట‌న మెస్మ‌రైజ్ చేస్తాయి. దేవ ద‌ర్శిణి కామెడీ సినిమాకు హైలెట్ అవ్వ‌గా సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది. 1960ల‌లో నాటి గ్రామాలు, ప్ర‌జ‌ల తీరుతెన్నులను, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలతో పాటు వారికి విధించే ఆంక్షలను, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన చిన్నచిన్న విషయాలను కూడా సెటైరికల్‌ గా చూపించారు. సినిమాలో ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త‌, అశ్లీల స‌న్నివేశాలు లేవు ఇంటిల్లి పాది అంతా క‌లిసి ఈ రఘు తాత సినిమాను చూసి ఆస్వాదించ‌వ‌చ్చు.

Also Read : Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి అక్షయ్ కుమార్‌ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com