Raghu Thatha: ఓటీటీలో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న కీర్తి సురేశ్‌ ‘రఘుతాత’ !

ఓటీటీలో సంచ‌ల‌నం సృష్టిస్తోన్న కీర్తి సురేశ్‌ ‘రఘుతాత’ !

Hello Telugu - Raghu Thatha

Raghu Thatha: మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘రఘుతాత(Raghu Thatha)’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ త‌మిళ చలన చిత్ర పరిశ్రమలో నిర్మించిన తొలి సినిమా. అంతే కాదు ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి బాలీవుడ్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ లకు కథా రచయితగా పని చేసిన సుమన్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించాడు. రవీంద్ర విజ‌య్, ఎమ్మెస్ భాస్కర్, స‌మి, దేవ‌ద‌ర్శిణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమిళంలో విడులైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించిన మేకర్స్ ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించి… ట్రైల‌ర్ కూడా వ‌దిలారు. అయితే అనివార్య కారణాల వలన తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు.

Raghu Thatha Movie Updates

అయితే తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాకముందే సెప్టెంబరు 13న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నేరుగా జీ5 ఓటీటీలో విడుదల చేసారు. దీనితో ఓటీటీలోకి వ‌చ్చిన ‘రఘు తాత’ చిత్రం అద్భుత‌మైన స్పంద‌న‌ను తెచ్చుకుని రికార్డులు సృష్టిస్తోంది. సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఫీల్ గుడ్‌గా న‌డుస్తూ చూసే ప్రేక్ష‌కుల‌ను సినిమాలోకి తీసుకెళుతుంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ జీ5 లో త‌మిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండగా ఈ సినిమా విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ వ్యూస్ ద‌క్కించుకుని సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Also Read : Demonte Colony 2: ఓటీటీలోనికి హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ ! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com