తమిళ సినీ రంగంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ రికార్డుల మోత మోగించింది. మరో వైపు ప్రముఖ నృత్య దర్శకు రాఘవ లారెన్స్ సైతం చంద్రముఖి 2లో నటించాడు. విచిత్రం ఏమిటంటే కె. వాసు దర్శకత్వంలో గతంలో వచ్చిన చంద్రముఖి చిత్రం బిగ్ సక్సెస్ అయ్యింది.
కాగా ప్రస్తుతం చంద్రముఖి 2 సీక్వెల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆ సినిమాలో జ్యోతికతో పాటు రజనీకాంత్ నటించారు. కానీ ప్రస్తుతం వారిద్దరి స్థానంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ , రాఘవ లారెన్స్ నటించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా జైలర్ సక్సెస్ కావడంతో సీక్వెల్ కూడా వస్తోందని సన్ పిక్చర్స్ ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే రజనీకాంత్ , రాఘవ లారెన్స్ ఇద్దరూ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి భక్తులు.
ఇవాళ రాఘవ లారెన్స్ రజనీ ఇంటికి వెళ్లారు. ఆయన కాళ్లకు నమస్కరించారు . తనను ఆశీర్వదించమని కోరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.