Raghava Lawrence: కోలివుడ్ టాప్ హీరో విజయ్ సినిమాలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉన్నారు. కొద్దిరోజు క్రితం తన తల్లి శోభ కోరిక మేరకు సాయిబాబా మందిరాన్ని ఆయన నిర్మించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. సాయిబాబా మందిరాన్ని నిర్మించాలని తన కోరిక అని శోభ తెలిపారు. ఇదే విషయాన్ని విజయ్ తో పలుమార్లు చెప్పగా… కొంతకాలం క్రితం చెన్నైలోని కొరట్టూరులో ఉన్న సాయిబాబా ఆలయాన్ని విజయ్ నిర్మించాడని ఆమె పేర్కొంది.
Raghava Lawrence Comments
అయితే చెన్నైలోని కొరటూరులో ఉన్న సాయిబాబా ఆలయాన్ని తాజాగా ప్రముఖ హీరో లారెన్స్(Raghava Lawrence) దర్శించుకున్నారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ పేజీలో ఇలా పంచుకున్నారు. ‘అందరికీ నమస్కారం… ఈరోజు నా స్నేహితుడు విజయ్ తన తల్లితో కలిసి కొరట్టూరులో కొత్తగా నిర్మించిన సాయిబాబా ఆలయానికి వెళ్లాను. నేను గతంలో రాఘవేంద్రుని ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం చేసినప్పుడు విజయ్ గుడికి రావడమే కాకుండా నన్ను అభినందించే క్రమంలో నా కోసం ఒక పాట కూడా పాడారు. ప్రస్తుతం విజయ్ నిర్మించిన ఈ ఆలయానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది.
నా స్నేహితుడు విజయ్ కి హృదయపూర్వక అభినందనలు. నేను ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే నాకు స్వచ్ఛమైన దివ్య ప్రకంపనలు కనిపించాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.’ అని అన్నారు. విజయ్ అమ్మగారితో లారెన్స్ కలిసి సందర్శించిన వీడియోను ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. అక్కడ ప్రతి గురువారం అన్నదానం ఉంటుందని శోభ తెలిపారు. ఆ సమయంలో తానే అక్కడకు వస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం లారెన్స్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : Tillu Square OTT : ఓటీటీకి సిద్ధమవుతున్న సిద్దు 100 కోట్ల చిత్రం ‘టిల్లు స్క్వేర్’