Radhika Apte : డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే తమిళ సినీ రంగానికి చెందిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో సినిమా కన్ ఫర్మ్ కూడా చేశాడు. దీంతో ఈ కాంబోపై అంచనాలు పెరిగాయి. ఎందుకంటే కథ నచ్చడమే కాదు తన వ్యక్తిత్వానికి తగిన పాత్ర ఉంటేనే తాను ఒకే చెబుతాడు సేతుపతి. ఇది ఆయన స్పెషాలిటీ. జవాన్ లో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించాడు. ఇటు కోలీవుడ్ లో విజయ్ తో చేసిన మూవీ తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. బుచ్చిబాబు సన తీసిన ఉప్పెనలో సూపర్ గా నటించాడు.
Radhika Apte in Puri Jagannath Movie
ఇదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకు పోతున్నాడు . తన సినీ కెరీర్ లో ఇలాంటి హీరోను చూడలేదన్నాడు బాద్ షా షారుక్ ఖాన్. చెన్నైలో జరిగిన ఈవెంట్ సందర్బంగా ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా తనను సర్ అని పిలిచాడు. దీంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా విజయ్ సేతుపతి హాట్ టాపిక్ గా మారాడు. ఇక టాలీవుడ్ లో ఎందరికో లైఫ్ ఇచ్చిన దర్శకుడిగా గుర్తింపు పొందాడు పూరీ జగన్నాథ్(Puri Jagannath). ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్పా ఏదీ ఆడలేదు. సీక్వెల్ తీసినా అది దొబ్బింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో తీసిన లైగర్ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది.
ఎంతో మందికి కథలు చెప్పాడు. కానీ కొత్తదనం లేదంటూ తిరస్కరించారు. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మహేష్ బాబు సైతం ఫోన్ చేయలేదంటూ వాపోయాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. సక్సెస్ ఉంటేనే పలకరిస్తారని లేదంటే ఇటు వైపు చూడరంటూ పేర్కొన్నాడు. ఈ తరుణంలో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో కన్ ఫర్మ్ చేయడంతో ఒక్కసారిగా పూరీ జగన్నాథ్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పటికే త్వరలో తీయబోయే పాన్ ఇండియా మూవీలో టబు నటిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో కీ రోల్ లో హీరోయిన్ గా రాధికా ఆప్టే(Radhika Apte) ఓకే చేశాడని వినికిడి. తను ఇదివరకే లయన్, లెజెండ్ సినిమాలలో బాలయ్య సరసన నటించింది.
Also Read : Madharasi Sensational :మదరాసిపై ఫోకస్ పక్కా సక్సెస్