Radha Madhavam :గ్రామీణ ప్రేమకధా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. పల్లెటూరి ప్రేమకథతో సహజసిద్ధంగా తెరకెక్కిన చిత్రం ‘రాధామాధవం’. రాధా మాధవం గోనాల్ వెంకటేష్ దర్శకత్వంలో వినాయక్ దేశాయ్ మరియు అపర్ణా దేవి నటించిన ఒక అందమైన రొమాంటిక్ చిత్రం. ఈ చిత్రానికి దర్శకుడు దాసరి ఇసాక్. వసంత్ వెంకట్ బాల ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించారు.
Radha Madhavam Movie Updates
షూటింగ్ పూర్తయిన ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ట్రైలర్ ను విడుదల చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీలా అనిపిస్తోందని, ట్రైలర్ చాలా బాగుందని అన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నానని చెప్పారు. నిర్మాత, హీరో, దర్శకులకు మంచి సక్సెస్ వస్తుందన్నారు.
చిత్ర నిర్మాత గోనల్ వెంకటేష్ మాట్లాడుతూ – “శ్రీకాంత్(Srikanth) గారు మా సినిమా ట్రైలర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది“ అన్నారు.ఫిబ్రవరిలో మా సినిమా విడుదల కానుంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి విజయం అందించాలని అన్నారు. హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్‌ని విడుదల చేసిన శ్రీకాంత్‌కి థ్యాంక్స్“ చెప్పారు. చిత్ర దర్శకుడు దాసరి ఇసాక్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్‌ని విడుదల చేసిన శ్రీకాంత్‌కి థ్యాంక్స్“ అని చెప్పారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమం జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించాలని అన్నారు. మరిన్ని అప్‌డేట్‌లతో చిత్రయూనిట్ త్వరలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Also Read : Big Boss Amardeep : బిగ్ బాస్ ఫేమ్ తో హీరో ఛాన్స్ కొట్టేసిన అమర్ దీప్