సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యన కొత్త కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు , వ్యాపారవేత్త మురళీ మోహన్ వార్తల్లో నిలిచారు. కారణం ఆయన మనుమరాలి గురించిన పెళ్లి వార్త. ఇంతకీ ఎవరీ రాగ అని ఆరా తీస్తే ఇప్పుడు తేలింది. ఐఎస్బీలో చదువుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవడం తప్పదు.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి తనయుడితో. ఇద్దరూ గత కొన్ని రోజుల నుండి పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారని, డ్యూయెట్లు కూడా పాడుకుంటున్నట్లు సినీ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలియడంతో ఇరు కుటుంబాలు అటు కీరవాణి, ఇటు మురళీ మోహన్ లు ఓకే చెప్పినట్టు టాక్. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారట. తెలుగు వారి సంప్రదాయం ప్రకారం ముహూర్తం కూడా ఫిక్స్ చేయబోతున్నట్టు సమాచారం.
ఇప్పుడు వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది. మొత్తం మీద టాలీవుడ్ లో పెళ్లి బాజాలు పోటా పోటీగా కొనసాగుతుండడం విశేషం.