R Madhavan : తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్. మాధవన్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన పూణే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీటీఐ) చీఫ్ గా ఆర్. మాధవన్ నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార , సినిమాటోగ్రఫీ మినిష్టర్ అనురాగ్ ఠాకూర్ పంచుకున్నారు. నామినేట్ అయిన సందర్భంగా ఆర్. మాధవన్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు.
R Madhavan Nominated
దేశంలోనే అత్యున్నతమైన సంస్థగా ఎఫ్టీటీఐ పేరు పొందింది. సదరు సంస్థకు ఆర్. మాధవన్(R Madhavan) అధ్యక్షుడిగా, పాలక మండలి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇక మాధవన్ కు విలక్షణమైన నటుడిగా గుర్తింపు ఉంది. ఆయన నటించి, దర్శకత్వం వహించిన రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ చిత్రం పలు ప్రశంసలు అందుకుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆర్. మాధవన్ స్పందించారు. తనను ఎఫ్టీటీఐ సంస్థకు చీఫ్ గా నామినేట్ చేసినందుకు కేంద్ర సర్కార్ కు , మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఠాకూర్ స్పందిస్తూ..మీ అపార అనుభవం, ధృడమైన నైతికత సంస్థను సుసంపన్నం చేస్తుందని పేర్కొన్నారు. సానుకూల మార్పులను తీసుకు వచ్చేలా చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు .
Also Read : Tiger3 Movie : దీపావళికి సల్మాన్ టైగర్ 3