R Madhavan : తమిళ సినీ రంగానికి చెందిన ఆర్ . మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు. కారణం ఆయన నటించి తీసిన రాకెట్రీ – ది నంబీ ఎఫెక్ట్ చిత్రం హాట్ టాపిక్ గా మారింది.
R Madhavan Movie Got Award
కారణం జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించారు. ఇందులో మాధవన్(R Madhavan) చిత్రం కూడా ఎంపికైంది. ఆయనకు జాతీయ అభిమానం కూడా ఎక్కువే. నటుడిగానే కాదు మోటివేటర్ కూడా పేరు పొందారు. తాజాగా ప్రకటించిన అవార్డులలో రాకెట్రీ – ది నంబీ ఎఫెక్ట్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ఈ సినిమాను ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎస్. నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తీశారు. ఆర్. మాధవన్ మూవీలో కీలకమైన పాత్ర పోషించాడు. అంతే కాదు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించాడు. ఆయన గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు నంబి నారాయణ్.
ఆ తర్వాత తాను నిరపరాధినంటూ నిరూపించు కునేందుకు చేసిన ప్రయత్నం, పడిన ఇబ్బందులు, కష్టాలను ఈ చిత్రంలో తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు మాధవన్. మరోసారి ఈ చిత్రం చర్చకు వచ్చేలా చేసింది ఎంపికైన అవార్డు ప్రకటన.
Also Read : RRR Movie : మరోసారి ఆర్ఆర్ఆర్ రికార్డ్