Pushpa 3 : మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప(Pushpa) , పుష్ప2 ఇప్పటికే రికార్డుల మోత మోగించాయి. దీంతో బన్నీ నుంచి పుష్ప-3 చిత్రం సీక్వెల్ గా రాబోతోందని ప్రకటించారు. దీంతో సినిమా రంగంలో ఈ వార్త మరింత ఆసక్తిని రేపింది. ఈ మూవీ వచ్చే 2028న విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే కథ కూడా చర్చల్లో ఉందని, ఇందులో కూడా తిరిగి బన్నీ నటించనున్నట్లు తెలిపారు నిర్మాత రవి శంకర్.
Pushpa 3 Updates
ఇందుకు సంబంధించిన తాజా పుష్ప3 పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇక డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ పుష్పను మనసు పెట్టి తీశాడు. ఇది భారతీయ సినిమాను షేక్ చేసింది. పుష్ప-2 ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ చిత్రంగా నిలిచింది. ఇందులో బన్నీతో పాటు రష్మిక మందన్నా నటించింది. స్పెషల్ సాంగ్ లో శ్రీలీల నటించింది..మెస్మరైజ్ చేసింది.
ఇక పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా నటించగా ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది నేషనల్ బ్యూటీ సమంత రుత్ ప్రభు. ఇదిలా ఉండగా చిట్ చాట్ సందర్బంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడారు. పుష్ప 3 తప్పకుండా వస్తుంది. ఇందులో అనుమానం అక్కర్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ కుమార్ తో పాటు త్రివిక్రమ్ తో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుందన్నాడు. ఇంతలో సుకుమార్ కూడా రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాడు. అందుకే 2028లో పుష్ప 3 వస్తుందన్నాడు.
Also Read : Shruti Haasan-Coolie Sensational :శ్రుతీ హాసన్ కూలీ లుక్ సెన్సేషన్