Pushpa 2 : ‘పుష్ప 2’ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్న వీడియోలపై హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) రాకముందే తొక్కిసలాట జరిగినట్టుగా కొందరు తప్పుడు వీడియోలు షేర్ చేస్తున్నారని తెలుపుతూ.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.
Pushpa 2 Team…
హైదరాబాద్సిటీ పోలీస్ అధికారిక ‘ఎక్స్’ పోస్ట్‌లో ఏం చెప్పారంటే.. ‘‘సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఐనా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం..’’ అని తెలిపారు.
Also Read : Sandhya Theatre Stampade : తొక్కిసలాటపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేసేవారికి పోలీసుల హెచ్చరికలు