Pushpa 2 : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప2 ది రూల్ మూవీ దుమ్ము రేపింది. ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 2,000 కోట్లకు పైగా వసూలు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మాలివుడ్ సినీ రంగాలను షేక్ చేసింది. ప్రత్యేకించి రికార్డుల మోత మోగించడంతో బాలీవుడ్ తట్టుకోలేక పోతోంది. అనవసర కామెంట్స్ చేస్తూ మరింత రాద్దాంతం చేస్తున్నారు.
Pushpa 2- RGV Shocking Comments
పుష్ప2 చిత్రం సక్సెస్ లో బన్నీ మేనరిజం, రష్మిక డైలాగులు, లవ్లీ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ కిస్సక్ కాసులు కురిపించేలా చేశాయి. బాక్సులు నిండేలా చేసింది. దీంతో అంతులేని ఆనందానికి లోనవుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే సక్సెస్ మీట్ లతో హోరెత్తిస్తున్నారు.
ఈ తరుణంలో బాలీవుడ్ నిర్మాతలు పుష్ప2 భారీ విజయాన్ని తట్టుకోలేక అనుచిత కామెంట్స్ చేయడంపై సీరియస్ గా స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV). వాళ్లు తీయలేరు. తీసిన వాళ్లను చూసి తట్టుకోలేరంటూ పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆర్జీవీ. క్రియేటివిటీకి ఈ మూవీ అద్దం పెట్టిందన్నాడు. ఇదిలా ఉండగా తను శివ ఒకే ఒక్క చిత్రంతో టాలీవుడ్ ను షేక్ చేశాడు. ఎవరూ ఊహించని రీతిలో బాలీవుడ్ పై తన జెండా పాతాడు. సత్య, కంపెనీ, డీ , సర్కార్ లాంటి సినిమాలు తీసి తనదైన మార్క్ చూపించాడు. ఆర్జీవీ అంటేనే ప్రతి ఒక్కరు గురువుగా భావిస్తారు.
Also Read : Sanam Teri Kasam- Record Breaking :సనమ్ తేరీ కసమ్ రికార్డ్ బ్రేక్