Pushpa-2 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు సుకుమార్ తీసిన పుష్ప మూవీ దేశాన్ని ఒక ఉర్రూతలు ఊగించింది. కోట్లు కొల్లగొట్టింది. బాక్సులు బద్దలు కొట్టేలా కలెక్షన్లు వచ్చాయి. ప్రత్యేకించి మేకింగ్, డైలాగులు, అల్లు అర్జున్ మాస్ అప్పియరెన్స్ జనాన్ని పిచ్చెక్కించేలా చేశాయి.
Pushpa-2 Movie Viral
దీంతో పుష్ప చిత్రానికి సీక్వెల్ కూడా తీసే పనిలో పడ్డాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఐకాన్ స్టార్ మేనియా ఇప్పుడు ఓవర్సీస్ ను కూడా తాకింది.
ఊహించని రీతిలో డిజిటల్ రైట్స్ , ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే ఓవర్సీస్ లో పుష్ప -2(Pushpa-2) మూవీ కోసం రూ. 90 కోట్లు ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పలువురు హీరోలకు ఓవర్సీస్ లో తెగ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ , మహేష్ బాబు, రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , చిరంజీవి లకు భారీ డిమాండ్ కూడా ఉంటుంది. తాజాగా తమిళ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ భారీ కలెక్షన్లు వచ్చాయి.
పుష్ప-2 విషయానికి వస్తే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టేందుకు వచ్చారంటే ఇక మూవీ మొత్తం రైట్స్ అమ్మితే రూ. 500 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందని సినీ పండితులు పేర్కొంటున్నారు.
Also Read : Jawan Advance : జవాన్ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్