Vijay Sethupathi : డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందాడు పూరీ జగన్నాథ్. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడడం లేదు. రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ బిగ్ సక్సెస్. ఆ తర్వాత సీక్వెల్ ఆశించిన మేర ఆడలేదు. రౌడీ విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా స్థాయిలో లైగర్ తీశాడు. ఇందులో అనన్య పాండే నటించిందినా అది కూడా వర్కవుట్ కాలేదు. బొక్క బోర్లా పడింది. ఇదే సమయంలో విజయ్ కెరీర్ పై ఎఫెక్ట్ పడింది. కానీ వరుసగా మూవీస్ లో నటిస్తూ వస్తున్నాడు .
Puri Jagannath -Vijay Sethupathi Movie Updates
ఇదే సమయంలో సినిమాలు ఆడక పోయినా మూవీస్ పట్ల తనకున్న పేషన్ కారణంగా కథలు రాస్తూ , కొత్త మూవీస్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇదే సమయంలో తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా పేరు పొందాడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్టు ఉగాది పర్వదినం సందర్బంగా అధికారికంగా ప్రకటించడం విశేషం.
విలక్షణమైన పాత్రలు, ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో తన ప్రతిభకు పేరుగాంచారు పూరి జగన్నాథ్. ఇక విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతిలో ఇంతకు ముందెన్నడూ చూడని ఒక కోణాన్ని పూరి ఒక ప్రత్యేకమైన స్క్రిప్ట్‌తో ప్రదర్శించడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది .
Also Read : Sikandar Shocking :సల్మాన్..రష్మిక సికందర్ కు మిశ్రమ స్పందన