Vijay Sethupathi : ప్రముఖ బాలీవుడ్ నటి టబు గురించి కీలక అప్ డేట్ వచ్చింది. తను తాజాగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలో న్యూ మూవీ రాబోతోంది. ఈ చిత్రం వచ్చే జూన్ నెలలో షూటింగ్ స్టార్ అవుతుందని ప్రకటించారు. ఇందులో తమిళ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కీ రోల్ పోషిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఆయనతో ఎవరు కథానాయకిగా నటిస్తారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించాడు దర్శకుడు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మెప్పించింది టబు.
Vijay Sethupathi – Puri Jagannath Movie
ఇటు బాలీవుడ్ లో అటు తెలుగు సినిమాలలో కూడా నటించింది. విలక్షణమైన నటనకు గుర్తింపు పొందాడు విజయ్ సేతుపతి. తను పూర్తిగా డిఫరెంట్. తనకు ఇష్టమైతేనే కథలకు ఓకే చెబుతాడు. ఏ మాత్రం తనను హర్ట్ చేసినా లేదా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే సీన్స్, మాటలు ఉన్నా ఒప్పుకోడు. అందుకే ఆయన వెరీ వెరీ స్పెషల్. తన కోసమే కథ రాసుకున్నానని, విజయ్ కి వినిపించానని, వెంటనే ఓకే చెప్పాడని వెల్లడించాడు.
తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. తను ఇప్పటికే పలు సినిమాలు తీశాడు. ఆయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ కు చెందిన వ్యక్తి. విజయ్ తో లైగర్ తీశాడు. అది ఆశించిన మేర ఆడలేదు. తనతో నటించేందుకు స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపక పోయినా సినిమా మీద ఉన్న ఆసక్తి, పేషన్ తో వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ కీలక ప్రకటన చేశారు దర్శకుడు. తమ కొత్త ప్రాజెక్టులోకి టబును ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశాడు.
Also Read : Hero Ajith-Good Bad Ugly : అజిత త్రిష అదుర్స్ మూవీ సక్సెస్