Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ అంటే భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా కుప్పకూలడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా… అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. దీనితో శాండిల్ వుడ్ తో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) కెరీర్ లో చివరిసారిగా నటించిన సినిమా గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఆ సినిమాను ఒక్కసారిగా ఓటీటీ ఫ్లాట్ ఫాం నుండి తొలగించింది… అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. దీనితో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
Puneeth Rajkumar – లైసెన్స్ గడువు పూర్తవడంతో సినిమాను తొలగించిన అమెజాన్ ప్రైమ్ వీడియో !
అయితే గంధడ గడ సినిమాకు తాము తీసుకున్న లైసెన్స్ గడువు ముగియడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తొలగించినా… మరికొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే… రూ.100 అద్దె చెల్లించి చూసే అవకాశం ఆయా డిజిటల్ ఫ్లాట్ ఫాం సంస్థలు కల్పించాయి. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్.
Also Read : Animal Ending : దిమ్మతిరిగే కలెక్షన్స్ తో క్లోజింగ్ ఇస్తున్న ‘యానిమల్’