Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం పుష్ప 2 ది రూల్(Pushpa 2). మూడేళ్ల క్రితం రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప ది రైజ్ సినిమాకు ఇది సీక్వెల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన పుష్ప 2(Pushpa 2) సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశారు మేకర్స్. ఇటీవలే బిహార్ వేదికగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ తో పాటు ట్రైలర్‌తో పుష్ప 2 సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఎప్పట్లాగానే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై ఏదో ఒక ప్రచారం వినిపిస్తూనే ఉంది. అలా తాజాగా పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ తప్పుడు ప్రచారంపై పుష్ప టీమ్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
Pushpa 2 Movie Updates
పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను షేర్ చేసి.. ‘డిసెంబర్ 5.. అస్సలు తగ్గేదేలే’ అనే క్యాప్షన్ ఇచ్చారు. తద్వారా అనుకున్న తేదీకే అల్లు అర్జున్ మూవీ రానున్నట్లు పక్కా క్లారిటీ ఇచ్చేసింది. అంతకు ముందే డిసెంబర్ 04న USA ప్రీమియర్స్ పడతాయని మేకర్స్ తెలిపారు. కాగా ‘పుష్ప’ మొదటి భాగం తర్వాత చాలా గ్యాప్ తర్వాత సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘పుష్ప 2’తో రాబోతున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇందులో స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఈ స్పెషల్ సాంగ్ ఆదివారం (నవంబర్ 24)న విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు.
Also Read : Posani Krishna Murali : The producer’s sensational tweet on actor Posani