Producer Vinod : నటుడు ప్రకాశ్ రాజ్‌పైౖ ‘మార్క్ ఆంటోని’ నిర్మాత వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌రాజ్ స్టైల్‌లోనే జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు ఎంపీ తిరుచ్చి శివ రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో పాటు ప్రకాశ్‌రాజ్ కూడా ఈ వేదికపై ఉన్నారు. ఉదయనిధితో దిగిన ఫొటోని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన షేర్ చేశారు. ‘‘ విత్ ఏ డిప్యూటీ సీఎం.. “జస్ట్ ఆస్కింగ్’’ అని పేర్కొన్నారు. దీనిపై ‘ఎనిమి’, ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాల నిర్మాత ఏస్ వినోద్ కుమార్(Producer Vinod) స్పందించారు.
Producer Vinod Comment
‘‘నీ పక్కన కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించారు. నువ్వు అయితే డిపాజిట్లు కూడా కోల్పోయావు. అదే మీ మధ్య ఉన్న వ్యత్యాసం. ఒక సినిమా షూటింగ్‌లో మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వ్యానిటీ వ్యాన్ నుంచి ఎక్కడికో వెళ్లిపోయావ్. దాని వల్ల ఆ రోజు కోటి రూపాయలు నష్టం వాటిల్లేలా చేశావు. అలా చేయడానికి కారణం ఏమిటి? జస్ట్ ఆస్కింగ్? కాల్ చేసి జరిగిందంతా చెప్తానన్నావ్. కానీ నువ్వు అసలు ఫోన్ చేయలేదు!!’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమా విషయంలో ఇలా జరిగిందనేది నిర్మాత వినోద్ చెప్పలేదు. అదే వేదికపై ప్రకాశ్ రాజ్ వైరల్ కామెంట్స్ చేశారు. పుస్తకావిష్కరణ ‘‘మన ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. మరొకరు ఉన్నారు సనాతన ధర్మం గురించి ఏదో మాట్లాడుతుంటారు’’ అని సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read : Karan Johar : బాలీవుడ్ లో నెపోటిజం పై భగ్గుమన్న కరణ్ జోహార్(